Employment

logo

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం,

ఇంద్రకీలాద్రి, విజయవాడ.

క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి

            ఆంధ్రా రాజధానిగా అమరావతి రూపుదిద్దుకున్న తదనంతరం దేవస్థానము ప్రాముఖ్యత పెరిగి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినందులకు దేవస్థానములో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుట జరిగినది మరియు దేవస్థానములోని ప్రత్యేక విభాగములలో సాంకేతిక నైపుణ్యం గల వారిని నియమించటం ద్వారా సర్వీసులను ప్రొఫెషనలైజ్ చేసే క్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఈ దిగువ తెలిపిన రంగాలలో 2 సంవత్సరాల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదిక మీద క్వాలిఫైడ్ వ్యక్తులను నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

క్రమ సంఖ్య హోదా సంఖ్య అర్హతలు వయోపరిమితి అనుభవం (సంవత్సరాలలో)
1 లీగల్ కోర్డినేటర్ 1 న్యాయ శాస్త్రం నందు పి.జి కోర్సు. 35-40 5 – 10
2 పి.ఆర్.ఒ 1 పౌర సంబంధాల శాస్త్రం లో డిగ్రి లేదా పాత్రికేయులుగా అనుభవం. 45-60 10 – 15
3 I.T మేనేజర్ 1 బి.టెక్ (IT లేదా కంప్యూటర్ సైన్స్) లేదా ఎం.ఎస్సీ., (కంప్యూటర్) 35-45 5 – 10
4 టూరిజం మేనేజర్ 1 టూరిజం నిర్వహణలో పిజి డిప్లొమా.  టూరిజం శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. 50-60 5-10
5 డోనార్ సెల్ మేనేజర్ 1 యం.బి.ఎ (మార్కెటింగ్) 40-50 5-10
6 మెడికల్ ఆఫీసర్ 1 పి.జి లేదా యం.బి.బి.ఎస్ 40-50 5-10
7 అసిస్టెంట్ డైరక్టర్

(పశు పోషణ)

1 పశు సంవర్ధక శాఖ లో పదవీ విరమణ పొందిన వారు
8 అసిస్టెంట్ డైరక్టర్

(ఉద్యాన శాఖ)

1 ఉద్యాన శాఖలో గా పదవీ విరమణ పొందిన వారు.
9 అసిస్టెంట్ కేటరింగ్ ఆఫీసర్ 1 డిప్లొమా ఇన్ హోటల్ మానేజ్ మెంట్ 25-35 3-5
10 చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ 1 పోలీసు శాఖలో DSP స్థాయి అధికారిగాని లేదా ఆర్మీ నందు కమాండెంట్ గా పనిచేసిన వారు. 50-65
11 అగ్నిమాపక అధికారి 1 అగ్నిమాపక శాఖలో అధికారి గా పదవీ విరమణ పొందినవారు. 58-65
  1. దరఖాస్తుదారులు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండవలెను.

  2. దరఖాస్తుదారులు పనిచేయు ఆశక్తితో పాటు శారీరక దారుడ్యం కల్గి ఉండవలెను.

  3. దేవాదాయ శాఖ అధికారుల కమిటీచే ఎంపిక విధానం జరుగును.

  4. ఎంపిక తదుపరి పనితీరును బట్టి కొనసాగించుటకుగాని లేదా తొలగించుటకుగాని దేవస్థానముకు అధికారము కలదు.

  5. దరఖాస్తులు స్వీకరించుటకు ఆఖరు తేది.5.06.2017

  6. దరఖాస్తులు కార్యనిర్వహణాధికారి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, జమ్మిదొడ్డి, బ్రాహ్మణ వీధి, విజయవాడ కు పంపవలెను.

  7. దరఖాస్తుదారులు పేరు, చిరునామ, వయస్సు, విద్యా అర్హతలు, మొబైల్ నెంబర్,ఆధార్ నెంబరు మొదలగు వివరములు మరియు దృవీకరణ పత్రములుతో పాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో జరపరచవలెను

  8. ఈ-మెయిల్ ద్వారా తమ ధరఖాస్తును దేవస్ధానము వారికి పంపగలరు. endow-eosdmsd@gov.in

  9. ధరఖాస్తు నమూనా లింక్  https://drive.google.com/file/d/0B2NJL9Lyp_lkTEp0d2ZxYk01cnM/view?usp=sharing

     కార్యనిర్వహణాధికారి

Comments are closed