H.D.P.T

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ 

దేవాదాయ ధర్మాదాయశాఖ, (ఆం.ప్ర.)

HDPT

దేవస్ధనము నందు నిర్వహించవలసిసిన కార్యక్రమములు 

క్తమ సంఖ్య   పండుగ/పర్వదినం                                                          విశేషం
1   శ్రీ పంచమి    ఈ పంచమినాడు సరస్వతిని విధి విధానంగా పూజించాలని బ్రహ్మవైవర్తపురాణం (ప్రకృతి ఖండం నాల్గవ అధ్యాయం)చెబుతున్నది. ఈరోజు సరస్వతీదేవి జన్మదినం.
2   మహాసరస్వతీ యాగం (విద్యార్ధుల కొరకు‌ ప్రత్యేక కార్యక్రమం)   ఈ మహాసరస్వతీ యాగము
  ఉగాది   యుగము ప్రారంభమైన రోజుకనుక దీనిని యుగాది అని కాలక్రమంలో ఉగాది అని అంటున్నారు. యుగాది నుండి అమలు జరుపు కుంటున్న ప్రభవాది 60 సంవత్సరాలకు చైత్రశుద్ద పాడ్యమి అయిన ఈరోజు మొదటిరోజు. ఈ రోజున పరగడుపున వేపపూతతో చేసిన పచ్చడిని తినడంవల్ల సర్వారిష్టాలు( గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైనవి) నివారించబడి, సర్వసంపదలు కలిగి, దీర్ఘాయువు, వజ్రమువంటి దేహము (రోగాలు లేకుండా అరోగ్యవంతమైన దృఢమైన దేహము) లభిస్తాయని-శతాయర్ వజ్రదేహాయ సర్వసంపత్ కరాయ చ!సర్వారిష్టవినాశాయ నింబకందల భక్షణం!!అనే పచనం తెలియజేస్తోంది. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఐదు అంగములుగా గల పంచాంగపఠనాన్ని ఉగాది రోజున శ్రద్ధగా వినడం వలన గ్రహదోషాలు నివారించబడి శుభఫలితాలు కలుగుతాయని, పంచాంగ శ్వవణం వల్ల గంగాస్నానం వలన లభించే పుణ్యంతో సమానమైన పుణ్యాన్ని పొందవచ్చునని ప్రాచీన గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
  సౌభాగ్య వ్రతం   సౌభాగ్యవతులైన స్త్రీలు యీరోజున సౌభాగ్య గౌరీవ్రతాన్ని ఆచరించాలని ‘వ్రతోత్సవసంగ్రహం’ చెబుతోంది. భర్త, పిల్లలు అఖండమైన సుఖ శాంతులను పొందటం కోసం యీ వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ వ్రతాన్నే సంపదగౌరీ వ్రతం, సౌభాగ్యగౌరీ వ్రతం, ఆందోళినీ వ్రతం, డోలాగౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు.
  వసంతపంచమి, లక్ష్మీ వ్రతం   శుక్లాయామథ పంచమ్యాంచైత్రే మాసి శుభాననా !!శ్రీ: బ్రహ్మలోకాత్ మానుష్యంసంప్రాప్తా కేశవాజ్ఞాయా!!తతస్తాం పూజయేత్ తత్రయస్తం లక్ష్మీ: న ముంచతి !!

అంటూ మహావిష్ణువు ఆజ్ఞతో  లక్ష్మీదేవి చైత్రశుద్ధ పంచమినాడు మనుష్యలోకానికి వచ్చిందని, ఆ రోజున లక్ష్మీదేవిని పూజించినవారిని లక్ష్మీ ఎప్పటికీ విడువదని, సకల సంపదలు సమకూరుతాయని బ్రహ్మపురాణం చెప్పింది.

6   శతక పరిచయం (విద్యార్థులకోసం ప్రత్యేక కార్యక్రమం)   తెలుగు సాహిత్యములో శతకానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. వీటి ద్వారా పిల్లలలో భక్తిభావమే కాకుండా, నైతిక విలువలు, మానవతా విలువలు, మంచి నడవడిక పెంపొందగలవు, నేటి విద్యావ్యవస్థలో పాఠ్యాంశాలలో ఈ శతకపఠనానికి తగినంత అవకాశం ఇవ్వబడనందున, విద్యార్థులలో శతకాలవట్ల ఆసక్తిని కలిగించి, తద్వారా వారిలో సాహిత్యాభిలాష నైతికవిలువలు, శీలసంపద పెంపొందించే లక్ష్యంతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ‘శతకపరిచయం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.     మానవుడికి విజ్ఞానం ఎంత ముఖ్యమో, వికాసం ఎంత ముఖ్యమో, వివేకం అంతకంటే ఎక్కువ ముఖ్యం. వివేకం రావాలంటే, పిల్లవాడి హృదయంలో ఒక మార్దవం ఏర్పడాలి.  ఆ మార్థవం రావాలంటే మనకు వారసత్వంగా సంక్రమిస్తున్న శతకసాహిత్యాన్నీ, నీతి సాహిత్యాన్నీ, మనం వినియొగించుకోవటం కన్నా మరో మార్గం లేదు.     నీతికి ఆధ్యాత్మికత యొక్క అండలేనిదే బలం లేదు. కనుక నీతి శతకాలతో పాటు భక్తి శతకాలను గూడా మన చిన్నారులకు చిన్నతనం లోనే మనం అందించుకోక తప్పదు.
  శ్రీ శంకర జయంతి   అధ్యాత్మికనావకు చుక్కాని వంటి ఆదిశంకరులు భక్తి, ఆధ్యాత్మిక పరంగా హైందవ జాతిని ఒకతాటిపై నడిపించారు. శతాధిక గ్రంథాలను రచించి జగద్గురువుగా ప్రసిద్ధులైన ఆదిశంకరులు, వైశాఖ శుద్ధ పంచమినాడు జన్మించారు.  సాక్షాత్తు శంకర స్వరూపులుగా చెప్పబడుతున్న వీరి జన్మ తిథి శంకర జయంతిగా జరుపబడుతోంది.
8   అక్షర దీవెన (సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం)   ‘అక్షరాభ్యాసం’ అనే కార్యక్రమం భారతదేశం లో అనాదిగా జరుపబడుతున్నది. క్షరముకానిదే అక్షరం. అంటే నశించనిది అని అర్థం. అటువంటి సుజ్ఞాన పరమైన అక్షరాన్ని నేర్చుకోవడమే అభ్యాసం. ఆ ప్రయత్న ప్రారంభమే అక్షరాభ్యాసం. పూర్వకాలంలో గురుకులాలుండేవి. గురుకులంలో గురువు దగ్గర విద్యనభ్యసించడానికి ముందు గురుముఖంగా, తల్లిదండ్రుల సమక్షంలో ఓనమాలు, దిద్దించడం సాంప్రదాయంగా ఉండేది. ప్రథమంగా వినాయకుడిని ప్రార్థించి, చదువుల తల్లి సరస్వతిని ప్రార్థించి, సృష్టి స్థితిలయకారకుడైన ఈశ్వరుని కృపాకటాక్షాలతో “ఓం నమ: శివాయ సిద్ధం నమ: అని వ్రాసి దానిని పిల్లవాడి చేత దిద్దించి సకల విద్యలకు నెలవైన మహాసరస్వతిని, ‘సరస్వతి!నస్తుభ్యం, వరదే! కామరూపిణి! విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతుమే సదా’ అంటూ ప్రసన్నం చేసుకొనే భక్తిపూర్వక కార్యక్రమమే అక్షరదీవెన.
 9   ‘శ్రావణలక్ష్మీ’ వరలక్ష్మీ వ్రతములు   శ్రావణమాసం లో వచ్చే’’ శ్రీ వరలక్ష్మీ వ్రతం’’ హిందూ స్త్రీలు నిర్వహించుకొనే విశేషమైన వ్రతం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొనే అతిముఖ్యమైన భక్తిపూర్వక కార్యక్రమమిది. ముత్తైదువులు పీఠంపై వరలక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించి ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ, ఫల, పురుషార్థాలతో పాటు, సకల సౌభాగ్యాలు కల్పించమని ప్రార్థిస్తూ, ఆదేవికి ప్రీతి పాత్రమగునట్లు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించే సామూహిక వరలక్ష్మీ పూజా కార్యక్రమమే ‘’శ్రావణలక్ష్మీ’’ ఈ వ్రతమును శ్రావణమాసములో వచ్చే ప్రతి శుక్రవారం నాడుగాని, వీలుకానిచో వరలక్ష్మీవ్రతం నాడు కాని జరుపుకొనుట ఆచారము.
10   దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు   శరత్ ఋతు ప్రారంభం లోని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులుగా చెప్పబడతాయి. ఈ తొమ్మిది రోజులూ మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణియైన ఆ జగన్మాతను పూజించటం సంప్రదాయం. ఇలా తొమ్మిది రోజులూ సాధ్యం కానివారు పంచమి నుండిగాని, సప్తమి నుండిగాని దేవిని పూజిస్తారు.     ఈ పూజలో భక్తితోపాటు శుచి, శుభ్రత, నిష్ట ముఖ్యం. ఈ నవరాత్రులలో ముత్తైదువులకు కాళ్లకు పసుపురాసి చీర లేదా రవికలగుడ్డ, పండు తాంబూలం సమర్పించటం శుభప్రదం. దేవీనవరాత్ర మహోత్సవాలలో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజించటానికి సాధ్యపడనివారు సప్తమి నుండి ‘దేవీత్రిరాత్రవ్రతం’ అనే పేరుతో మూడురోజులపాటు ఆ జగదంబను పూజించేవారు – ‘మూలాయాం స్థాపయేద్దేవీం……….’ అనే శాస్త్రవచనాన్ని అనుసరించి మూలానక్షత్రం రోజున కలశస్థాపన చేసి పూజను ప్రారంభిస్తారు.
 11   సప్తమి, దుర్గాష్టమి   సామూహిక సరస్వతీ పూజ, సామూహిక లలితా / లక్ష్మీ సహస్రనామ పారాయణ, కుంకుమార్చన.
12    మహానవమి   దేవీనవరాత్రులలో చివరిరోజైన మహానవమి అత్యంత ప్రధానమైనది.  ఈ రోజున అమ్మవారికి చేసే జప, హోమ, అర్చనలు విశిష్టఫలాన్ని అందిస్తాయి. నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు చండీహోమాన్ని ఆచరించలేనివారు అమ్మవారి ప్రీతిపాత్రమైన చండీహోమాన్ని ఈరోజున నిర్వహిస్తారు.
13   విజయదశమి, శమిపూజ   ఈ విజయదశమినాడు అమ్మవారిని పూజిస్తే సకలశుభాలు కలుగుతాయని, ఈనాడు ఏపని ప్రారంభించినా విజయవంతం అవుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ విషయాన్నినవమి శేష యుక్తాయాం దశమ్యాం అపరాజితా !దదాతి విజయం దేవి పూజితా జయవర్థినీ !!  అనే స్కాందపురాణ వచనం తెలియజేస్తుంది.  ఈ రోజు సాయంకాలం జమ్మిచెట్టును పూజించి అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్యచ!దుస్స్వప్ననాశనీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం!!

          అనే మంత్రం చదివి నమస్కరించాలని గోపథ బ్రహ్మణం చెబుతోంది.

14   పుణ్యనదీ హారతి    ‘అప్స సర్వం ప్రతిష్ఠతమ్’, ఆపో వా ఇదగ్ం సర్వం’ ‘నీటిలోనే జగత్తంతా యిమిడి ఉంది. జగత్తంతా నీటికి ప్రతిరూపమే’ అంటోంది శ్రుతి.         ఉపనిషత్తులు సృష్టిక్రమాన్ని చెబుతూ – ‘అద్భృ:పృథివీ, పృథివ్యా: ఓషధయ:, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష:……’ అంటున్నాయి. అంటే నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు (సస్యము, ధ్యానము), ఓషధుల వల్ల అన్నం, అన్నంవల్ల జీవులు ఏర్పడినట్లు తెలుస్తోంది. నీరే సర్వజగత్తుకూ ఆధారం.  అందుకే ప్రాణులజీవనానికి ఆధారమైన నీటిని ‘జీవనం’అన్నారు. చరాచర జగత్తుకు ఆధారభూతమైన భూమికి కూడా నీరే అధారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఈ జగత్తులో జీవనదులన్నీ జీవులైతే సముద్రుడు పరమాత్మ. ఒకే పరమాత్మ బహుదేహులలో ఉండి చివరకు ఆ జీవులనుతనలో లీనం చేసుకున్నట్లు సముద్రుడు తన నీటిని మేఘాలుగా చేసి, నదులకు చేర్చి, ఆ నీటిని మరల తనలో కలుపుకుంటున్నాడు.          పరమాత్మ నుండి విడివడిన జీవాత్మ ఎన్నటికైనా తిరిగి పరమాత్మను చేరినట్లు! సముద్రజలాలు నదులై చివరకు సముద్రుణ్ణి చేరుకొంటాయన్నమాట.  అందుకే ‘ఆప: స్వభావతో మేధ్యా: ‘ అన్నాయి శాస్త్రాలు. అంటే ‘నీళ్ళు ఆత్మలాగా స్వభావ సిద్ధంగానే పవిత్రమైనవి’ అని. పవిత్రజలాలు నదులరూపం లో ప్రవహిస్తూ తీర ప్రాంతం లోని  ప్రాణులకు జీవనాన్ని ప్రసాదిస్తున్నాయి.

          పుట్టిన జీవికి తొలుత జీవనాన్ని ప్రసాదించేది అమ్మ కనుక ప్రకృతిలో  మనకు జీవనాన్ని ఇచ్చే ప్రతిదానిలోను ‘అమ్మ’ తనాన్ని భావన చేస్తూ, ఈ మాతృత్వభావనతో గోమాత, భూమాత, నదీమతల్లి, అడవితల్లి అంటూ వాటిని అమ్మగా చూడటం మన సాంప్రదాయం. ఈ కారణంగానే  హిందూ సంస్కృతిలో గంగా, గోదావరీ, కృష్ణా వంటి నదులకు హారతులు ఇవ్వటం సంప్రదాయం అయింది.

          పవిత్ర నదులలో ఎందరో స్నానం చేసి, వారి పాపాలను ప్రక్షళన చేసుకుంటారు. ఆ పాపాలన్నీ ఆయా నదులు భరించవలసివుంది కావున ఆ సందర్భంగా నదులు కూడా ఎంతో కొంత పాప పంకిలములవుతాయి. అందువలన ఆ పాపాల ప్రక్షాళన కోసం నదీమతల్లికి పూజలు చేసి, హారతులు సమర్పించడం జరుగుతుంది.  అందుకే ఈ పవిత్ర నదీమ తల్లులకు మన నీరాజనం.

          అంతేకాక హారతిని ఇవ్వడానికి పత్తితో చేసిన వత్తిని ఆవునేతిలో తడిపి వెలిగించి నప్పుడు కాంతులు వెలువడి చీకటి దూరమౌతుంది.  పాపలోకాలు చీకటిమయాలని, పుణ్యలోకాలు కాంతిమయాలని ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే మనం ‘అసతోమా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ’ అంటూ ప్రార్థిస్తాం.  దీప ప్రజ్వలన ఐశ్వర్యానికి, సుఖానికి, జ్ఞానానికి హేతువు, దీపాలను వెలిగించటం ద్వారా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, దీపాలను కార్తీకపూర్ణిమనాడు వెలిగిస్తే దేవతలు ప్రీతిచెంది మనకు మంచి స్థితిని కలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

          శరత్ పూర్ణిమ అధ్యాత్మిక యోగసాధనకు విశేషమైనది. ధ్యానం, అర్చన మొ!!నవి ఈ రోజున అద్భుత ఫలాన్నిస్తాయి. మనస్సుకు కారకుడైన చంద్రుడు శరద్ ఋతువులో మరింత వెన్నెలను ప్రసాదిస్తూ మనస్సును ఉత్తేజపరుస్తాడు. అందులోను ఆశ్వయుజపూర్ణమ కన్నా కార్తీక పూర్ణిమనాడు చంద్రుడు అత్యధికంగా ప్రకాశిస్తాడు.  ఆనాడు మన మనస్సులోని భావనలకు మరింత ఉద్ధీపన కలుగుతుంది.

          ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:’ అన్నట్లు అన్నింటికి మనస్సే కారణం కనుక ఈ రోజున మనస్సు సద్భావనలో లీనం కావడం అవసరం. అందువల్ల దైవభక్తి, దీపారాధన, నదీహారతి వంటి సంప్రదాయం మన సంస్కృతిలో చోటు చేసుకుంది.  కృత్తికా నక్షత్రం అగ్నినక్షత్రం. అగ్నిలో భగవత్ స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం. అందుకే వేదాలలో ‘నక్షత్రేష్టి’ అనేది కృత్తిగా నక్షత్రంలో మొదలవుతుంది. అంతటి మహిమగల కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కార్తీక పూర్ణిమ.

          కార్తీకపూర్ణిమ నాడు దీపాలను వెలిగించడానికి ప్రత్యేకంగా హారతులు ఇవ్వడానికి ఇదేకారణం. అంతేకాదు కార్తీక పూర్ణిమను ‘వేద దీపావళి’ అంటున్నాయి పురాణాలు.  దీపాలలోను, హారతులలోను మనకు కనిపించే దీపకళిక సాక్షాత్తు లక్ష్మీదేవి. అందుకే ఆమెను ‘లోకైకదీపాంకురాం’ అంటూ ప్రస్తుతిస్తున్నాం. దీపాన్ని వెలిగించటం లక్ష్మీప్రదం.

          పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పూర్ణిమనాడే శివుడు త్రిపురాసురుని సంహరించాడు. అందువల్ల దీనిని ‘త్రిపురపూర్ణిమ’అని కూడా అంటారు. త్రిపురాసురులను సంహరించాక విజయుడై వచ్చిన ఆయన గౌరవార్థం పార్వతీదేవి మొదటగా జ్వాలా తోరణాన్ని వెలిగించిందని, అప్పటి నుండి కార్తీకపూర్ణిమ నాడు జ్వాలాతోరణం వెలిగించబడుతోందని తెలుస్తోంది. ఈ జ్వాలా తోరణోత్సవాన్ని త్రిపురోత్సవం అంటారు.

          ‘పౌర్ణమాస్యాం తు సంధ్యాయాం కర్తవ్య: త్రిపురోత్సవ: అనే భవిష్య పురాణ వచనాన్ని బట్టి ఈ రోజున త్రిపురోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.

          కనుక ‘పుణ్యనదీహారతి’, ‘జ్వాలాతోరణోత్సవం’ కార్యక్రమాలలో భక్తులెల్లరు పాల్గొని యీ పుణ్యఫలాన్ని అందుకుంటారని అకాంక్ష. 

15     గీతా జయంతి   మార్గశిరశుద్ద ఏకాదశినాడు శ్రీ కృష్ణభగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ఈ రోజు ‘గీతాజయంతి’గా ప్రసిద్ధికెక్కింది. ఈ రోజున భగవద్గీతను పూజించటం, గీతాపారాయణ చేయటం ఫలప్రదాలు. కొందరు ఈ రోజున శ్రీమన్నారాయుణుని పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ఇది ఏకాదశీవ్రతం. ఇది ఆచరించినందువల్ల ఇహమూ పరమూ, అంటే ఇహంలో సౌఖ్యం, పరంలో మొక్షం లభిస్తాయని, అందువల్లనే దీనిని ‘సౌఖ్యదా ఏకాదశి’ అని ‘మోక్షదాఏకాదశి’ అని అంటారని తెలుస్తోంది.ఈ ఏకాదశీవ్రతమాహాత్య్మాన్ని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు పద్మపురాణం తెలియజేస్తోంది.

Comments are closed