NEWS

logo

 

1. Alaya Seva will be conducted on every 3rd Sunday.

2. OPENING OF HUNDIALS ON 16-011-2016 and 17-11-2016 AT 7 A.M pilgrims intrested in counting can participate in Hundi counting and get blessings from Sri Ammavaru

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ

ప్రెస్ నోట్

భారతదేశములో ప్రసిధ్ధిని పొందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానములో సామాజిక సంక్షేమము కోసము రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షిస్తూ శతచండీ సహిత రుద్ర యాగమును ది.16.11.2016న ప్రారంభించినారు. శ్రీమల్లిఖార్జున మహా మండపము దగ్గర కార్యనిర్వహణాధికారిణి, శ్రీమతి.ఎ.సూర్యకుమారి దంపతులు ఈ యాగమును ప్రారంభించగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనరు శ్రీమతి అనురాధ అగ్నిమధన కార్యక్రమములో పాల్గొన్నారు.
దేవస్థానము వారు మొట్టమొదటసారిగా కార్తీక మాసములో ఈ శతచండీ యాగమును ప్రారంభించటం విశేషం. ఈ రోజు నుండి 5 రోజులు పాటు జరిగే మహోన్నతమైన ఈ యాగము ప్రారంభం రోజునే శ్రీ దుర్గమ్మ అనుగ్రహానికి గుర్తుగా చక్కని వర్షం కురిసింది. కలియుగములో మానవులు అందరూ తరించటానికి చండీయాగము ఎంతగానో తోడ్పడుతుంది. భక్తుల కోరికలు నెరవేరే విధముగా భక్తిశ్రధ్ధలతో 70 మంది దేవస్థాన అర్చకస్వాములు నిర్వహించే అపూర్వమైన ఈ యాగము విశేష మైన ఫలితాలను ప్రసాదిస్తుందని పురాణాల వచనం.
శ్రీ అమ్మవారి వైభవాన్ని, స్వామి వారి ఆశీస్సులను పొందే అవకాశాన్ని ఈ యాగము ప్రసాదిస్తుంది. భక్తులందరూ విశిష్టమైన ఈ యాగాన్ని వీక్షించి ధన్యులు కావాలని, యాగ ప్రసాదాన్ని తీసుకొని సకల శుభాలు పొందాలని భక్తులకు శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు విజ్ఞప్తి చేశారు. తేది:20.11.2016 వరకు కొండ దిగువున మహామండపం ప్రాంగణములో నిర్మించిన ప్రత్యేకయాగశాలలో జరుగుతున్న ఈ శత చండీసహిత రుద్రయాగమును భక్తులెల్లరూ తిలకించి, ఆశీస్సులు పొందవచ్చును. ది.20.11.2016న పూర్ణాహుతి అనంతరం మహామండపము 6వ అంతస్తులో శాంతి కళ్యాణం జరుగుతుందని తెలియజేసినారు.

కార్యనిర్వహణాధికారిణి

దీపోత్సవము తేది 22-11-2016

శతచండీ సహిత రుద్ర యాగమును ది.16.11.2016

OPENING OF HUNDIALS INFORMATION

Online Registrations for  Bhavanis Launched 

 

Comments are closed