SRI RAJA RAJESWARI DEVI

logo

శ్రీ దుర్గా మల్లే శ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి. విజయవాడ.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము

Sri Raj Rajeshwari

శ్రీ రాజరాజేశ్వరి దేవి:

“ అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీవైష్టవీ బ్రహ్మణీత్రిపురాంతకీ సురనుతాదేదీప్యమానోజ్జ్వలా చాముండాశ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ‘’

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు ఈమె ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈమెను ‘ అపరాజితాదేవి’ గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. ఈమె స్వప్రకాశజ్యోతిస్వరూపిణి. పరమేశ్వరుడి అంకం ఈమెకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది.ఈమె యోగమూర్తి.మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని  రాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. “ ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌః సకల హ్రీం’’ అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చెయ్యాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చెయ్యాలి.వీలైనవారు శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.

శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ అమ్మవారి అలంకారములు

Comments are closed